ద్రష్టలకు నిజమైన అవకాశం – సైన్స్ ఫిక్షన్ వ్రాయటం.
ఇప్పుడంటే మహేష్ బాబు, మెగా ఫామిలీలు యడాపెడా ప్రకటనల్లో నటిస్తూ జేబు నింపుకుంటాన్నారు. కాని మన వాళ్ల తెల్ల తోలు మోజు, హాలీవుడ్ పిచ్చి ఇలాగే కంటిన్యూ అయితే తరువాతి తరంలో ప్రకటనలకు హాలీవుడ్ తారలనుండి తెలుగు తారలు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటారేమో.
భారత దేశం, తెలుగు దేశం ఎటు వెళ్తుంది, కుల రహిత సమాజం వైపుకా, కులాల పునస్సమీకరణలవైపా
మత మార్పిడుల వల్ల తరువాతి యాబై వంద సంవత్సరాలల్లో ఏ ఏ సంఘటనలు జరగవచ్చు.
ట్రాఫిక్ సమస్యలను తరువాత తరాలు ఎలా సాల్వ్ చెయ్యబోతున్నాయి.
సాఫ్ట్ వేర్ కూలీల బతుకు ఎలా ఉంటుంది కొన్ని వర్షాల తరువాత.
రవాణా, సమాచార రంగంలో వచ్చే విప్లవాత్మకమైన మార్పులు భారత ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయి.
ఇలా భవిష్యత్తును గురించిన ఆలోచనలు మీకు ఉన్నాయా. వాటిని ప్రదర్శిచే ప్రదేశం లేదా. అయితే సైన్స్ ఫిక్షన్ వ్రాయండి. మీలోని ద్రష్టను తృప్తిపరచండి.
మీకు సైన్స్ ఫిక్షన్ రచనపై అమితాసక్తి ఉంటే ఈ గుంపులో చేరగలరు. http://groups.google.com/group/tesficaa/
ps: drashTa = futurist
Filed under: Uncategorized
